Haqeeqat ki Talaash

0.00

Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఖుర్ఆన్ ప్రత్యేకతేమిటంటే అది దాదాపు వేయిన్నర సంవత్సరాలుగా భూమిపై ఉంది. ఈ పదిహేను వందల సంవత్సరాల కాలంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి. చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. కాలం ఎన్నో మలుపులు తిరిగింది. అయినా నేటి వరకూ దాని ఏ ఒక్క మాటా అసత్యమని రుజువు కాలేదు.

Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఖుర్ఆన్ ప్రత్యేకతేమిటంటే అది దాదాపు వేయిన్నర సంవత్సరాలుగా భూమిపై ఉంది. ఈ పదిహేను వందల సంవత్సరాల కాలంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి. చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి. కాలం ఎన్నో మలుపులు తిరిగింది. అయినా నేటి వరకూ దాని ఏ ఒక్క మాటా అసత్యమని రుజువు కాలేదు. అది ప్రతికాలంలో బుద్ధివివేచనలకు, సాంస్కృతిక అవసరాలకు ఎడతెగని సహకారం అందజేస్తూ పోయింది. దీని బోధనల్లోని సార్వజనీనత ఎక్కడా అంతం కాలేదు. అది ప్రతికాలపు సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతుంది. ఇంతవరకూ ఏ మానవ గ్రంథానికీ లభ్యంకాని ప్రత్యేకత ఈ మహోన్నత గ్రంథానికి లభ్యమై ంది. మానవ విరచితమైన ప్రతి తత్వశాస్త్రం కేవలం కొన్ని దినాల్లోనే తన తప్పి దాన్ని బహిర్గతపరుచుకుంటుంది. కాని శతాబ్దాలపై శతాబ్దాలు గడిచిపోయిన ప్పటికీ ఈ గ్రంథం (ఖుర్ఆన్) నిజాయితీలో రవ్వంత తేడా కూడా గోచరి ంచలేదు. ఖుర్ఆన్ ప్రారంభంలో ఏదైతే చెప్పిందో, నేటి వరకూ దాని సత్యతలో ఎటువంటి వ్యత్యాసం రాలేదు. అది మొదట్లో ఏ విధంగా యదార్థమో, నేడు కూడా అలాగే అది యదార్థం. ఖుర్ఆన్ ఈ ప్రత్యేకత వల్ల మనకు అర్థమయ్యే దేమిటంటే భూత, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సకల జ్ఞాన పరిధుల్ని పరివేష్టించి ఉన్న ఓ మేధ నుండి ఇది ఉనికిలోకి వచ్చింది. దీని శాశ్వత స్థిరత్వమే ఇది దైవవాణి అనటానికి ప్రత్యక్ష నిదర్శనం.

Reviews

There are no reviews yet.

Be the first to review “Haqeeqat ki Talaash”

Your email address will not be published. Required fields are marked *

Haqeeqat ki Talaash
0.00
Scroll to Top