సుస్పష్టమైన, విస్తృతమైన తన వివరణతో ఈ పుస్తకం శాంతి మరియు యుద్ధం గురించి ఇస్లామీయ బోధనలపై ఉన్న అపార్థాలను తొలగిస్తుంది. ఇస్లాం పూర్తిగా శాంతియుత ధర్మం అనటానికి తగిన ప్రామాణికమైన ఆధారాలను ఇందులో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఇస్లాంలో, శాంతి అనేది సాధారణ నియమం. యుద్ధం కేవలం ఒక మినహాయింపు విషయం మాత్రమే. ఖురాన్లో పేర్కొన్న దేవుని లక్షణాలలో ఒకటి అస్- సలాం లేదా ‘శాంతికి మూలం’. అంటే సర్వేశ్వరుడైన అల్లాహ్ స్వతహాగా శాంతిప్రదుడు. ఇస్లాం మిషన్ ఏకత్వంపై కేంద్రీకృతమై ఉంది. ఖురాన్ మరియు ప్రవక్త జీవిత ఆదర్శం- ఒక్క సృష్టికర్త పట్ల మాత్రమే భయ-భక్తులు కలిగి, అత్యంత శ్రద్ధా భక్తులతో ఉండేలా ప్రజల మనస్సులను మలచటమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇస్లామీయ యజ్ఞం ప్రారంభం- అంతం కూడా ఇదే.
ఈ పుస్తకం విద్యార్థులకు, పండితులకు మరియు సగటు పాఠకులకు సూటిగా, సమగ్రంగా సమాచారం అందిస్తుంది. ఇది పాఠికుడిని చదివించగలిగే పుస్తకం. శాంతి సంస్కృతి కలిగిన ఇస్లాంలో హింసను ఎలా ఇస్లామైజ్ చేసి, ఉగ్రవాదం, ఇస్లామిక్ జిహాద్, హైజాకింగ్ మరియు బందీలు చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి లోతైన అవగాహన కలిగిస్తుందీ పుస్తకం.
Reviews
There are no reviews yet.