ఖుర్ఆన్ దైవ గ్రంథం. అది తన సిసలయిన అరబీ భాషలో సర్వవిధాలా సురక్షితంగా ఉంది. అలాంటి ఒక ఉద్గ్రంథం తర్జుమా ఎన్నటికీ మూల గ్రంథానికి ప్రత్యామ్నాయం కాజాలదు. అంత మాత్రాన అరబీ భాష రాని వ్యక్తి ఖుర్ఆన్న అర్థం చేసుకోలేడని దీని భావం ఎంతమాత్రం కాదు. ఖుర్ఆన్ అరబీ భాషలో ఉన్నప్పటికీ, అది తన వాస్తవికత రీత్యా ప్రకృతి భాషలో ఉంది. ప్రతి గ్రంథరాజానికి ఒక విషయమంటూ ఉంటుంది. ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఖుర్ఆన్ ప్రధానాంశం దేవుని సృష్టి ప్రణాళికను మనిషికి కపటం అంటే దేవుడు ఈ జగతిని సృష్టించటంలోని ఉద్దేశ్య మేమిటో మనిషికి తెలియజేయటం అన్నమాట! అంటే మనిషి ఈ భువిపై ఎందుకు వసింపజేయబడ్డాడు? మరణించేవరకూ అతను ఇక్కడ ఏ విధంగా జీవించాలి? మరణానంతర జీవితంలో అతను ఎదుర్కొనే పరిస్థితులేమిటి? అనేవి అతనికి ముందుగా తెలియపరచటం అవసరం – మానవుడు ఒక శాశ్వత సృష్టి. అతని జీవన యాత్ర మరణానంతరం కూడా కొనసాగు తుంది. ఈ సంపూర్ణ జీవన యాత్ర కోసం ఖుర్ఆన్ ఒక మార్గదర్శక గ్రంథంగా ఉంటుంది.
Quran
Quran (ఖురాన్ )
₹0.00
ఖుర్ఆన్ దైవ గ్రంథం. అది తన సిసలయిన అరబీ భాషలో సర్వవిధాలా సురక్షితంగా ఉంది. అలాంటి ఒక ఉద్గ్రంథం తర్జుమా ఎన్నటికీ మూల గ్రంథానికి ప్రత్యామ్నాయం కాజాలదు. అంత మాత్రాన అరబీ భాష రాని వ్యక్తి ఖుర్ఆన్న అర్థం చేసుకోలేడని దీని భావం ఎంతమాత్రం కాదు. ఖుర్ఆన్ అరబీ భాషలో ఉన్నప్పటికీ, అది తన వాస్తవికత రీత్యా ప్రకృతి భాషలో ఉంది.
Reviews
There are no reviews yet.